ఓవైపు రాజకీయాల్ని పక్కనపెట్టి మరీ పవన్ కల్యాణ్ వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఇది ఫ్యాన్స్ కు ఆనందం కలిగించే విషయమే. అయితే ఇందులో కూడా అభిమానులు నిరాశ చెందే విషయం ఉంది. ఆ నిరాశ ఇప్పుడు రెట్టింపు అయ్యేలా ఉంది.
వరుసపెట్టి సినిమాలు చేసే పవన్ కల్యాణ్, అందులో రీమేక్స్ కే ఎక్కువ చోటిస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ రిలీజ్ చేశాడు. ఈ రెండూ రీమేక్ సినిమాలే. దీంతో పవన్ పై రీమేక్ రాజా అనే ముద్ర పడింది.
ఇది చాలదన్నట్టు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా రీమేక్ సినిమానే చేస్తున్నాడు ఈ హీరో. తమిళ్ లో హిట్టయిన తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోంది. ఈ రీమేక్స్ మధ్యలో వినోదాయ శితం అనే మరో రీమేక్ కూడా పవన్ చేతిలో ఉంది
ఇక్కడితో పవన్ కల్యాణ్ రీమేక్స్ పరంపర ఆగలేదు. రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా స్టార్ట్ చేశాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా కూడీ రీమేక్ అంటూ కొత్త ప్రచారం అందుకుంది.
ఇలా వరుసపెట్టి రీమేక్స్ చేస్తున్న పవన్ పై అసహనంతో ఉన్నారు అభిమానులు. ఇప్పుడు సుజీత్ సినిమా కూడా రీమేక్ అనే టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ డబుల్ అవుతోంది.