రూపాయి విలువ మరోసారి పతనమైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఉదయం 82.33 వద్ద ట్రేడ్ అయింది. రూపాయి విలువ నిన్నటితో పోలిస్తే ఇవాళ 16 పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, దేశీయ మార్కెట్‌లో నెగటివ్ ట్రెండ్ వంటి కారణాలతో రూపాయి విలువ మరింతగా పడిపోయింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి దిగజారిపోయింది. ఈ రోజు ఉదయం రూ. 82.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఓ దశలో రూ. 82.33 కు చేరుకుంది. ఈ క్రమంలో గత రాత్రితో పోలిస్తే రూపాయి విలువ ట్రేడింగ్‌లో 16 పైసలు తగ్గినట్లు విశ్లేషకులు వెల్లడించారు.
తొలిసారి ట్రేడింగ్‌లో గురువారం 82 కన్నా తక్కువగా క్లోజ్ అయ్యింది. రూపాయి విలువ గురువారం ఒక్కసారిగా కుప్పకూలింది. తొలిసారిగా చరిత్రలో 82 మార్క్ దిగువకు చేరింది. 55 పైసలు నష్టపోయి 82.17 వద్ద క్లోజ్ అయింది.
ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలో 81.52 స్థాయి వద్ద రూపాయి సానుకూలంగా ప్రారంభమైంది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటంతో స్థానిక కరెన్సీ క్రమంగా క్షీణించింది. గత ట్రేడింగ్ రోజైన మంగళవారం రూపాయి 20 పైసలు పెరిగింది. దీంతో 81.62 వద్ద ముగిసింది.