భూమి లోపలి వరకు తవ్వితే ఏం బయటికి వస్తుంది? ఈ డౌట్ తోనే సోవియట్ రష్యా వాళ్లు 1969 లో భూమిలోపలికి తవ్వడం ప్రారంభించారు. దాదాపు 20 సంవత్సరాల పాటు కష్టపడి 12,226 మీటర్లు వరకు తవ్వారు అంటే 12 కిలోమీటర్లకు పైనే…. ఆ తర్వాత తవ్వలేకపోయారు. ఎంతగా డ్రిల్ చేయడానికి ప్రయత్నించినా…..డ్రిల్ చేసే పరికరాలు కరిగిపోవడం, షేప్ ఔట్ అవ్వడం జరిగాయట….దీంతో తమ ప్రయత్నాలను అర్థాంతరంగా విరమించుకుంది రష్యా.!
అయితే ప్రస్తుతం ఆ రంద్రం గుండా…. నరకంలో శిక్షించబడే ఆత్మల శబ్దాలు వినిస్తుంటాయని అంటారు అక్కడి స్థానికులు…. ఆ రంద్రంలో పడితే డైరెక్ట్ నరకానికి పోతారని కూడా వారు విశ్వసిస్తుంటారు. అయితే సైంటిఫిక్ గా….భూమిలోపలికి 40 వేల అడుగుల కన్నా ఎక్కువగా తవ్వలేం… అక్కడి ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి.