ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. రష్యా బలగాలు ఒక్కో సిటీని కమ్మేస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సై అంటూ కాలు దువ్వుతూనే ఉంది.
రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలమట్టం చేసినట్లుగా తెలిపింది.
ఇటు ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లుగా రష్యా ప్రకటించుకుంది. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు తమను తాము రక్షించుకొని విజయం సాధిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిముత్రో కులేబా తెలిపారు. శాంతియుతంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. రష్యాను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని కోరారు.