మరియాపోల్ నగరంలోని ఒక ఆస్పత్రి వార్డుపై దాడి వెనుక రష్యా హస్తం ఉందని కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను రష్యా ఖండించింది. ఈ ఆరోపణలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ కేంద్రంగా వ్యాప్తి చేశారని తెలిపింది.
‘ కెనడియన్ ప్రభుత్వం చేసిన నిరాధార ఆరోపణలను మేము నిర్ద్వద్వంగా తిరస్కరిస్తున్నాము. ‘రష్యన్ వైమానిక దాడి’ ఫలితంగా ఆస్పత్రి భవనం దెబ్బతిన్నట్టు చూపిస్తున్న వీడియోలు పచ్చి అబద్దాలు” అని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది.
‘ ప్రజలను రెచ్చ గొట్టేందుకు కీవ్ పాలకులు చేస్తున్న చర్య అని పేర్కొంది. రష్యా రాయబార కార్యాలయం కథనాన్ని ఖండించింది మరియు కైవ్ వాదనల యొక్క వాస్తవికతను స్వతంత్రంగా ధృవీకరించడానికి కెనడియన్ మీడియా ఎటువంటి ప్రయత్నం చేయలేదని పేర్కొంది.
ఉక్రెయిన్ లోని మరియా పోల్ లో మెటర్నిటీ ఆస్పత్రిపై బాంబుదాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు మరో ముగ్గురు మరణించారు. ఈ ఘటనకు రష్యా కారణంగా ఉక్రెయిన్ చెబుతోంది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.