ముందుగా ప్రకటించినట్లుగానే రష్యా మొదటి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. గమేలియా సంస్థతో పాటు రష్యా రక్షణమంత్రిత్వ శాఖ సంయుక్తంగా కలిసి ఈ వ్యాక్సిన్ ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ ను మొదటిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూతురికి ఇచ్చారు.
వ్యాక్సిన్ విడుదల చేశామని, వ్యాక్సిన్ ఇచ్చాక తన కూతురికి స్వల్ప జ్వరం వచ్చిందని పుతిన్ ప్రకటించారు. అయితే అది వెంటనే తగ్గిపోయిందన్నారు.
రష్యా ప్రభుత్వం ఫేజ్-1,2 క్లినికల్ ట్రయల్స్ మాత్రమే చేసి వ్యాక్సిన్ ను రిలీజ్ చేస్తుందని… కీలకమైన ఫేజ్ 3 ట్రయల్స్ ను చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ భద్రపై ఆందోళన ఉందని, రష్యా ప్రభుత్వం పునరాలోచించాలని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డా.ఫౌచీ కోరినా రష్యా చెప్పిన సమయానికే వ్యాక్సిన్ విడుదల చేసింది. అయితే దీన్ని ముందుగా రష్యా సైనికులు, వృద్ధులకు ఇవ్వబోతుండగా… సెప్టెంబర్ నుండి వ్యాక్సిన్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉండనుంది.