ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాక్సిన్ కు ఆగస్టు 12న టీకా విడుదల చేస్తున్నామని రష్యా అధికారికంగా ప్రకటించింది. గమలేరియా రీసర్చ్ ఇన్ స్టిట్యూట్, రష్యా రక్షణమంత్రిత్వ శాఖ ఈ టీకాను రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ ను తొలిదశలో మెడికల్ సిబ్బందికి, వృద్దులకు ఇవ్వనున్నట్లు రష్యా ప్రకటించింది.
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 1600మందిపై జరిపిన పరిశోధనల్లో సంతృప్తికర రిజల్ట్స్ వచ్చాయని… అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు ప్రయోగాల ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. వ్యాక్సిన ఎంత సేఫ్ అన్నది కీలకమని, ఆగస్టు 12న రిజిస్టర్ చేస్తామని, ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు.
దీనిపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతే రష్యా వ్యాక్సిన్ పై తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు, ప్రెసిడెంట్ ప్రజారోగ్య సలహదారు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు.