అగ్రరాజ్యం అమెరికా, రష్యాల మధ్య ఖైదీల విడుదలకు సంబంధించి పరస్పర ఒప్పందం జరిగింది. దీంతో అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రినర్‌ను అమెరికాకు రష్యా అప్పగించింది. బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను రష్యాకు అమెరికా అప్పగించింది.
బ్రిట్నీ గ్రీనర్ ఒలింపిక్స్‌లో రెండు సార్లు గోల్డ్ మెడల్ గెలిచారు. ఆమె రష్యా పర్యటనలో ఉన్న సమయంలో మాదక ద్రవ్యాల కేసు నమోదైంది. దీంతో ఆయన్ని రష్యన్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. న్యాయ విచారణ అనంతరం ఆయన్ని జైలుకు పంపారు.
ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడంతో ఆమెను స్వదేశానికి తీసుకు రావాలని బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యాతో ఖైదీల పరస్పర విడుదల కోసం చర్చలు జరిపింది. చివరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ క్రమంలో అబుదాబిలో ఇరు దేశాల అధికారులు కలుసుకున్నారు. విమానాశ్రయంలోనే అమెరికాకు గ్రీనర్‌ను అప్పగించి, విక్టర్ బౌట్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ బ్రిట్నీ గ్రైనర్ (31) రష్యా ప్రీమియర్ లీగ్ కోసం గత ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లింది.
ఆ సమయంలో కస్టమ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆమె లగేజీలో హషిష్ నూనె దొరకింది. దీంతో రష్యా కస్టమ్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆపై మాదక ద్రవ్యాల ఆరోపణలతో ఆమెకు తొమ్మిదేళ్ల శిక్షను న్యాయస్థానం విధించింది.