ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రష్యా భూభాగం గుండా సురక్షితంగా తరలించేందుకు “మానవతా కారిడార్”ను రూపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు రష్యా బుధవారం తెలిపింది.
మీడియా సమావేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ… రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో భారతదేశం తటస్థంగా వ్యవహరించినందుకు భారత్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 6 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్టు కేంద్ర మంత్రి వీ. మురళీధరన్ తెలిపారు.
తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. మార్చి 2 నుంచి 8 తేదీల్లో 31 విమానాల ద్వారా 6300 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తరలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.