ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం 52వ రోజుకు చేరింది. ఉక్రెయిన్ లో ఇంకా పలు నగరాలపై రష్యా బాంబుదాడులు కొనసాగుతున్నాయి. ఇప్పట్లో కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించడం లేదు.
ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి సహాయం చేస్తున్నందుకు అగ్రరాజ్యం అమెరికాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు అమెరికాకు రష్యా లేఖ రాసింది. ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం పంపుతున్న ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్రిక్తత మరింత పెరిగిందని లేఖలో రష్యా పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఉంటాయని అమెరికాను రష్యా హెచ్చరించినట్టు పేర్కొంది.
మరో వైపు యుద్ధంలో ఇప్పటివరకు 3000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మరో 10000 మంది సైనికులు గాయాలపాలైనట్టు వివరించారు. మరియాపోల్ నగరరంలో వేలాది మంది పౌరులు మరణించినట్టు పేర్కొన్నారు.