ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే.. మరోవైపు, పరస్పర దాడులకు దిగడంతో ఇరు దేశాల వైఖరి బోధపడటం లేదు. రష్యా బలగాలపై ఉక్రెయిన్ సేనలు క్రమంగా పట్టు పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి.
అయితే, రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర సిటీల నుంచి వెనుదిరుగుతూ శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. ఎక్కడ ఏ మందుపాతర పేలుతుందో తెలియక.. సాధారణ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ వీడియో సందేశంలో ప్రజలను హెచ్చరించారు.
రష్యన్ బలగాలు తూర్పు దిశగా ఫోకస్ పెడుతుండటంతో రానున్న రోజుల్లో పోరాటం మరింత తీవ్రం కావొచ్చని చెప్పారు. రష్యా బలగాల షెల్లింగ్ పూర్తిగా ఆగేదాకా అందరూ వేచి చూడాలని సూచించారు. మరోవైపు మరియుపోల్ సిటీలో చిక్కుకున్న బాధితులను తరలించేందుకు తాము ప్రయత్నించగా వీలుకావడంలేదని శనివారం రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది.
The Ukrainian military has gone on the offensive and reportedly attacked a fuel depot in the Russian town of Belgorod, near the Ukraine border! A video shows 2 attack choppers launching missiles that strike the facility in a daring nighttime raid. pic.twitter.com/ZA1u6AdB67
— The NOLA Tabloid (@thenolatabloid) April 1, 2022
ఇక ఇంతకాలం సొంత గడ్డపై పుతిన్ సేనలను ఎదుర్కొంటూ వచ్చిన ఉక్రెయిన్ బలగాలు… తొలిసారి రష్యా భూభాగంపై దాడి చేశాయి. సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్‌లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున రెండు హెలికాఫ్టర్ల ద్వారా బాంబులు కురిపించినట్టు స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ వెల్లడించారు.
ఈ ధాటికి ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని, చుట్టుపక్కల వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలిపారు. చమురు నిల్వ కేంద్రం నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 170 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు గవర్నర్ వివరించారు.అయితే, ఈ దాడిపై ఉక్రెయిన్ మౌనంగా ఉంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆ దేశ రక్షణ మంత్రి దిమిత్రో కులేబా నిరాకరించారు. రష్యా చమురు డిపోపై దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Russia said two Ukrainian military helicopters crossed the border and struck an oil depot in the city of Belgorod early Friday.
Ukraine hasn’t commented on the alleged attack https://t.co/wxyM1pgXD6 pic.twitter.com/8fFKVMlXvz @Quicktake
— btcn asia (@btcnasia) April 1, 2022
Advertisements