ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై దాఖలైన పిటిషన్ పై ఉత్తర్వులను ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని తాము ఉత్తర్వులు జారీ చేయబోమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
ఇప్పటికే జరుగుతున్న తరలింపు ప్రయత్నాలపై తాము ఏమీ వ్యాఖ్యానించడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను అభినందిస్తున్నట్టు చెప్పిన సీజేఐ.. అదే సమయంలో ప్రజల ఆందోళన గురించి కూడా తాము ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
మనం గత తప్పిదాల నుంచి ఎలాంటి పాఠాలూ నేర్చుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇందులో ఇంతకుమించి చెప్పాల్సిందేదీ లేదని.. కానీ.. విద్యార్థుల గురించి తాము ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు.
అవసరమైతే తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అటార్నీ జనరల్ కు సూచించారు. ఈ విషయంలో తాము ఆదేశాలు జారీ చేయమని, కానీ.. ఈ విషయంలో ఏదో ఒకటి చేయండి చెప్పారు ఎన్వీ రమణ.