రష్యా రక్షణకు శాఖకు చెందిన వెబ్ సైట్ హ్యకింగ్ కు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనక రష్యా వ్యతిరేక హ్యాకర్ల హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రష్యా రక్షణకు చెందిన డేటా బేస్ ను తాము హ్యాక్ చేసినట్టు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రకటించుకున్నారు.
ఈ వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని, తమ వెబ్ సైట్ హ్యకింగ్ కు గురికాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, ఏజెన్సీ సిబ్బంది వ్యక్తిగత డేటాను దొంగిలించామని అనామక హ్యాకర్ల బృందం చెబుతోంది. ఉక్రెయిన్ విజయం కోసం సోఫా ఆధారిత ఫైటర్స్ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం నవ్వు తెప్పిస్తోంది ”అని రక్షణ శాఖ పేర్కొంది.
‘రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్నెట్ పోర్టల్ అన్ని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సాధనాలు కేటాయించిన కొలమానలతో యథావిధిగా పని చేస్తున్నాయి. ఆ వెబ్‌సైట్ సర్వర్‌లలో సైనికుల, రక్షణ మంత్రిత్వ శాఖ ఇతర ఉద్యోగుల వ్యక్తిగత డేటాను నిల్వ చేయలేదు. ఈ విషయం ఉక్రేనియన్లకు తెలియదు” అని వెల్లడించింది.