ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు కురిపించిన రష్యన్ మోడల్ గ్రెట్టా వెడ్లెర్.. దారుణ హత్యకు గురైంది. ప్రస్తుతం ఈ ఘటన రష్యాలో సంచలనం రేపుతోంది. అయితే.. ఆమె డెడ్ బాడీని పాతసూట్ కేసులో కుక్కి ఓ ఫాం హౌస్‌లో పడేసినట్టు తెలుస్తోంది.
ఆమె గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ”బాల్యంలో పుతిన్ చాలా అవమానాలను గురయ్యాడు. అలా కావడానికి కారణం అతని ఫిజిక్. దీనితో అతడు తన కోసం తాను నిలబడలేకపోయాడు. న్యాయ విద్యను విడిచిపెట్టి కేజీబీలో చేరడానికి అదే కారణం కావచ్చు. అందుకే నా దృష్టిలో పుతిన్ ఒక మానసిక రోగి” అంటూ విమర్శించింది.
ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కొన్ని రోజులకే ఆమె కనిపించకుండా పోయింది. తాజాగా.. ఏడాది తర్వాత మృతదేహామై కనిపించింది. దీంతో ఆమె మరణం ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. వెడ్లెర్ మరణానికి సంబంధించి రష్యా అధికారులు ఓ వీడియో విడుదల చేశారు.
Advertisements
అందులో వెడ్లెర్ ను ఆమె ప్రియుడు దిమిత్రి కోరోవిన్ డబ్బు కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు ఉంది. పుతిన్ కు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ప్రియుడు అంగీకరించాడు. ఇదిలా ఉంటే గెడ్లెర్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో పుతిన్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.