కాక్ పిట్‌లో పైలట్ చేసిన పని చివరకు అతని ఉద్యోగం ఊడగొట్టింది. వివరాల్లోకెళితే..రష్యాకు చెందిన ఓ పైలట్..ఫ్లైట్ ఎలా నడపాలో నేర్పించాలంటే తను చెప్పినట్లు నడుచుకోవాలని మహిళా ట్రైనీ కేడెట్‌కు కండీషన్ పెట్టాడు. మహిళా ట్రైనీ తొలుత అందుకు ఒప్పుకోలేదు. కానీ, తర్వాత ఒప్పుకునేలా చేశాడు ఆ పైలట్.
పైలట్..ఆ మహిళా ట్రైనీ కేడెట్‌తో విమానంలోని కాక్ పిట్‌లో సెక్స్ చేశాడు. ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసి సదరు మహిళా ట్రైనీని కాక్ పిట్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ వీరు చేసిన పని కెమెరాలో రికార్డు అయింది. ఈ విషయం ససోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారికి తెలిసింది.
సివిల్ ఏవియేషన్ వారు పైలట్, ట్రైనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ట్రైనీని కూడా ఆ స్కూల్‌కు రావొద్దని సూచించారు.
ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత తాను మహిళా ట్రైనీని కాక్ పిట్ కు తీసుకెళ్లానని సదరు పైలట్ పేర్కొన్నాడు. అయితే, తాను కేవలం ముద్దు పెట్టుకున్నానని అన్నాడు. కాగా, వీడియోను పరిశీలించిన స్కూల్ వారు అంతకు మించి జరిగిందని ధ్రువీకరించి పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.