రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ క్రూర మృగం అని, అతనెప్పుడూ సంతృప్తి చెందడని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం ఇక్కడే ఆగిపోదని, మిగతా ప్రపంచంపైనా అది ప్రభావం చూపుతుందని తెలిపారు.
యుద్ధంపై ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ఆయన… ‘ మేము అమెరికా లేదా కెనడాకు దూరంగా ఉన్నామని అంతా అనుకుంటారు. లేదు, మేము స్వేఛ్చా జోన్ లో ఉన్నాము” అని ఆయన తెలిపారు.
‘ హక్కుల పరిధి, స్వేచ్ఛలను ఉల్లంఘించినప్పుడు, యుద్దంలో అడుగుపెట్టినప్పుడు మీరు మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే మొదట మాపై యుద్ధం జరుగుతోంది. రెండో సారి మీపై యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఆ క్రూర మృగం వీలైనంత వరకు వేటాడుతూనే ఉంటుంది” అని అన్నారు.
ఈ యుద్ధాన్ని ఆపేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చాలా చేయగలడని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. “ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు అపగలరని నమ్ముతున్నాను. ఆయన ఆ పని చేయగల సమర్థుడు” అని అన్నారు.