ఆప్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తాలిబన్లకు రష్యా సర్కార్ షాక్ ఇచ్చింది. తాలిబన్ల నూతన ప్రభుత్వ ఏర్పాటు వేడుకలకు హాజరుకాబోమని రష్యా ప్రకటించింది. రాయబారస్థాయి అధికారులు ఆప్ఘన్‌లో తాలిబన్ ప్రభుత్వ ప్రారంభ వేడుకలకు హాజరవుతారని ప్రకటించినా… తాజాగా రష్యా నో చెప్పింది.
తమ ప్రభుత్వ ఏర్పాటు వేడుకలకు హాజరు కావాలని తాలిబన్లు పాకిస్తాన్, రష్యా, ఇరాన్, చైనా సహా పలు దేశాలను ఆహ్వానించాయి. అయితే, వేడుకలకు హాజరైతే తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించినట్లు అవుతుందని పలు దేశాలకు వెనుకడుగు వేస్తున్నాయి.