- పుతిన్ తో కలిసి నేర్చుకున్నానన్న భామ
ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఇప్పుడంతా ఇరు దేశాల యుద్ధతంత్రాలపై చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రష్యా మాజీ గూఢచారి ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు.
తాను కూడా తండ్రిలాగే మిలటరీలో చేరాలని అనుకున్నట్టు ఆమె తెలిపారు. ఆ తర్వాత గూఢచర్యంలో తాను శిక్షణ తీసుకున్నట్టు, ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ కు శిక్షణ ఇచ్చిన వారే తనకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.
అక్కడ పుతిన్ తో పాటు తనకు ఒత్తిడిలో కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలు, మానవ అక్రమ రవాణా ముఠాలకు సెక్స్ ను వలగా వేసి సమాచారం ఎలా రాబట్టాలో ప్రత్యేకంగా తనకు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
Advertisements
తనకు 20 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు డ్రగ్స్ ముఠాలు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులపై గూఢచర్యం కోసం పంపారని తెలిపారు. ఆ సమయంలో తాను చేసిన తప్పిదం వల్ల దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో తాను చావుకు దగ్గరగా వెళ్లి వచ్చినట్టు ఆమె వెల్లడించారు.