ఉక్రెయిన్ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్ లో ఎటు చూసినా కంటతడి పెట్టించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతి కష్టంగా భర్తలను విడిచి పెట్టి వెళుతున్న భార్యలు, భారమైన హృదయాలతో తండ్రులకు దూరంగా వెళుతున్న పిల్లలే కనిపిస్తున్నారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే పలు దేశాలు తరలింపు ప్రక్రియను మొదలు పెట్టాయి.
కానీ ఉక్రెయిన్ పౌరుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో మార్షల్ లా విధించారు. దీని ప్రకారం 18 నుంచి 60 ఏండ్ల లోపు పురుషులు దేశం విడిచి వెళ్లడం నిషేధం.
దీంతో కనీసం తమ భార్యా పిల్లలనైనా కాపాడుకుందాం అని అక్కడి పురుషులు అనుకుంటున్నారు. అందుకే వారిని రైలు ఎక్కించి వారికి వీడుకోలు చెబుతున్నారు.
మళ్లీ ఎప్పుడు కలుస్తారో.. అసలు కలుస్తారో లేదో తెలియని పరిస్థితులు. ఈ క్రమంలో భర్తను విడిచిపెట్టి వెళ్లలేక భార్యలు, తండ్రిని విడిచి పెట్టలేక పిల్లలు కంటతడి పెట్టుకున్నారు.
Advertisements
వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.