రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోస్ నేడు భారత్ కు రానున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన భారత్ కు వస్తున్నారు. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ తో శుక్రవారం భేటి కానున్నారు. పలు అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత తొలిసారిగా ఆయన భారత్ కు వస్తు్న్నారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయన నేడు సాయంత్రానికి న్యూఢిల్లీ చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
గతవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించారు. ఏప్రిల్ 11న యూఎస్, భారత్ ల చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు.