రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో రష్యా చర్చలు కొనసాగుతాయన్నారు. అదే సమయంలో మూడో ప్రపంచ యుద్ధ నిజమైన ముప్పు ఇంకా మిగిలే ఉందని ఆయన అన్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి.

మంచితనానికి కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. అవతలి వ్యక్తులు కూడా మంచిగా ప్రవర్తించకపోతే అది చర్చల ప్రక్రియకు సహాయం చేయదన్నారు. కానీ తాము చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. కానీ ఈ విషయంలో జెలెన్ స్కీ నటిస్తున్నాడని ఆయన అన్నారు.
జెలెన్ స్కీ విధానాలను పరిశీలిస్తే, ఆయన మాటలను విశ్లేషించుకుంటే చాలా వేల రకాల వైరుద్యాలు కనిపిస్తాయని తెలిపారు. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే, ఇది ఖచ్చితంగా ఆగిపోతుందని తనకు నమ్మకం ఉందన్నారు. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలో మూడవ ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమని లావ్‌రోవ్ చెప్పారు.