నేపాల్ విమాన ప్రమాదంలో 72 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన రష్యన్ మహిళ ఒందురో కథ కన్నీరు పెట్టిస్తోంది. నేపాల్లో ఉన్న తన భర్తను కలుసుకునేందుకు వెళ్లి బందురో తిరిగి రాని లోకాలకు వెళ్లింది. ట్రావెల్ బ్లాగ్ నిర్వహిస్తున్న ఆ మహిళ ప్రమాదానికి కొద్ది సేపు ముందు ఓ సెల్పీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టింది.
దానికి గోయింగ్ టూ నేపాల్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. అయితే ఆమె ఇటీవలే గర్భం దాల్చినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్తను కలుసుకునేందుకు ఆమె నేపాల్ వెళ్లినట్టు ఆమె సోదరి వెల్లడించారు.
ప్రమాదానికి గురయ్యే ముందు రోజు తనతో బందురో చాలా సేపు మాట్లాడిందని ఆమె సోదరి వెల్లడించింది. ఇక్కడా అంతా చాలా ప్రశాంతంగా ఉందని తనతో ఆమె చెప్పినట్టు ఎలేవా సోదరి పేర్కొంది. పొఖారాకు వెళ్లేందుకు ఉదయం 7.45కు విమానం ఉందని ఒందురో చెప్పిందని పేర్కొంది.
ఇంతలోనే ఇలా ప్రమాదంలో ఒందురో ప్రాణాలు పోగోట్టుకోవడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. నేపాల్ రాజధాని ఖట్మండ్ నుంచి పోఖారాకు వెళుతుండగా విమానం కుప్ప కూలింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.