ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు గడగడలాడిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కరోనా వైరస్ ఉంది అనే మాట వినాల్సి వస్తుందో అన్న భయం అన్ని దేశాలను వేధిస్తూ వస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దిగ్గజ దేశాలు సైతం వణికిపోతున్నాయి. అయితే… ఇంత జరుగుతున్నా ఒకే ఒక్క దేశం, అందులోనూ వెనుకబడిన దేశాల్లో ఉన్న ఓ దేశం మాత్రం కరోనా వైరస్ మాత్రం ధరి చేరటం లేదు.
ఎలాంటి వ్యాక్సిన్ లేకుండా, కేవలం ముందస్తు చర్యల వల్ల కరోనా ఆ దేశాన్ని తాకలేకపోతుంది. ఆ దేశమే… ఆఫ్రికన్ దేశాల్లో ఒకటైన రువాండా. ఈ చిన్న దేశాన్ని మాత్రం కరోనా వైరస్‌కు ఏమాత్రం జంకకుండా… నిర్భయంగా ఉంది. ఇందుకు ఒకే ఒక్క కారణం… అక్కడి ప్రజల ముందు జాగ్రత్త చర్యలు.
కరోనా వైరస్ అడ్డుకోవటంలో ముఖ్యమైంది… చేతులు శుభ్రం చేసుకోవటం. అందుకే అక్కడ ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలంటే… ముందుగా శుభ్రం చేసుకోవాల్సిందే. ప్రతి బస్టాపులోనూ ప్రత్యేకంగా వాష్ బేసిన్‌లు ఉంటాయి. ఇలాంటి వ్యవస్థ మరెక్కడా లేదు. గతంలో 1994లో భయంకరమైన మారణహోమంతో తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశం… ఇప్పుడు అభివృద్ది పథంలో ముందుకెళ్తోంది. అంతేకాదు… భారత్‌లాంటి దేశాలన్నీ ప్లాస్టిక్ సంచుల నిషేధం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే… దాదాపు 10 సంవత్సరాల నుండే అక్కడ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది.
వ్యక్తిగత శుభత్ర, పారిశుద్ద్యం ఉంటే… కరోనా వైరస్ ఏం చేయలేదని నిరూపిస్తోంది అతి చిన్న దేశం. ఆ చిన్న దేశమే… ఎంతో ఘనకీర్తి అని చెప్పుకుంటున్న అభివృద్ది చెందుతున్న దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది.