ఆర్ఎక్స్100 సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించికున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. అందాన్నే నమ్ముకున్న ఈ భామ ఇప్పుడు లాక్ డౌన్ టార్గెట్ తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకోవాలని పట్టుదలతో ఉందట.
నార్త్ ఇండియా నుండి వచ్చిన హీరోయిన్స్ ఎవరికీ పెద్దగా తెలుగు రాదు. కానీ లాక్ డౌన్ పిరియడ్ ముగిసే సరికి తెలుగు నేర్చుకోవాలని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టుకుందని తెలుస్తోంది. అయితే… తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ను పెట్టుకోకుండా… గూగుల్ తల్లినే నమ్ముకుందని తెలుస్తోంది.
ఆర్ఎక్స్100 తర్వాత పెద్దగా హిట్స్ లేకపోవటంతో ప్రస్తుతం ఒక సినిమాకు 80లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ భామ, మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది.