ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనే స్వయంగా వచ్చేసింది అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను త్వరగానే కోలుకుంటానని, ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్ భూపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

అజయ్ భూపతి ప్రస్తుతం మహా సముద్రం అనే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరో శర్వానంద్, సిద్ధార్థ్ తో పాటు సాయి పల్లవి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య వరుసగా పెరుగుతోంది. ఇప్పటికే బాహుబలి దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబం కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్లాస్మా దానం కూడా చేస్తానని ప్రకటించారు.
సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ, కరోనా ఉధృతి నేపథ్యంలో ఎవరూ ముందుకు రావటం లేదు. అయినా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.