Rx100 సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తికేయ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మొదటి సినిమా అందుకున్నంత రేంజ్ లో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. ఇటీవల రిలీజ్ అయినా 90 ఎంఎల్ సినిమా కూడా నిరాశపరిచింది.
తాజాగా కార్తికేయ మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తుకున్నాడు. బన్నీ వాసు నిర్మాణంలో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా సినిమా చెయ్యబోతున్నాడు . చావు కబురు చల్లగా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని సమాచారం. కార్తికేయ సరసన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి నటించనుందని సమాచారం. ఈ సినిమా పై అధికారక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.