దర్శకుడు అజయ్ భూపతి తన తొలి చిత్రం RX100 తో సూపర్ హిట్ అందుకుని సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక ఇటీవల రెండవ సినిమా మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులకు అనుకున్న కిక్ ఇవ్వలేకపోయింది. RX100 లాంటి సూపర్ హిట్ ఫిల్మ్ తీసిన అజయ్ మహాసముద్రంను బెలూన్ పేల్చినట్లు పేల్చేసాడు.
దీనితో చాలా మంది హీరోలు అజయ్‌తో కలిసి పని చేయడానికి ఆలోచిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కెరీర్ పరంగా అజయ్ భూపతికి పెద్ద మైనస్ అనే చెప్పాలి.
ఇకపోతే అజయ్ భూపతి OTT ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ కోసం ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్, బడ్జెట్ అన్నీ సెట్ అయ్యాయట. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతుందట.
మరి ఈ సినిమాతో అజయ్ భూపతి ఏమైనా మ్యాజిక్ చేస్తాడో లేక మళ్ళీ నిరాశ పరుస్తాడో చూడాలి.