ఆర్ఎక్స్ 100 నిర్మాత సీరియల్ నటి శ్రావణి ఆత్మ హత్య కేసులో నిందితుడు అశోక్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి వస్తానని చెప్పి చివరి నిమిషంలో అశోక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణికి దగ్గర అయినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె దేవరాజుకు దగ్గర కావడాన్నీ అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు.
సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరు విడిపోయేందుకు సహకరించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్ రెడ్డి అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారంలో అశోక్ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిలో ఇద్దరైన దేవరాజ్, సాయి లను అరెస్ట్ చేసిన పోలీసులు అశోక్ రెడ్డి కి ముందుగానే నోటీసు ఇచ్చారు.