సైరా టీజర్ విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్‌ని కలసి శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమా సాహో కూడా విడుదలకు ముస్తాబైంది. ఈనెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న చిరంజీవి సైరా విడుదలవుతుంది.
నెలరోజుల గ్యాప్‌లో వస్తున్న ఈ రెండు భారీ చిత్రాల హీరోలు.. ఇలా ఒకేచోట సందడి చేశారు. చిరంజీవి, ప్రభాస్‌తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్న ఈ ఫొటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రామ్ చరణ్.. తన దోస్త్ ప్రభాస్ కోసం సాహో మూవీలో పెట్టుబడి పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్.