ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీ హిట్ అయితే ప్రొడ్యూసర్ హ్యాపీ. ఫట్ అయితే ఫ్రస్టేషన్..! ఇది కామన్. ఎంత కొమ్ములు తిరిగిన నిర్మాత అయినా భారీ బడ్జెట్ మూవీ హిట్ కాక పొతే జీరో అయిపోవార్సిందే..! కోలుకోవాలంటే కష్టమే. భారీ బడ్జెట్ సినిమాలు హిట్ కావాలని అటు ప్రొడ్యూసర్… ఇటు హీరో… మరో వైపు డైరెక్టర్ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. పనికోసం ఎదురు చూసే టెక్నీషియన్లు కూడా పది మందికీ పని దొరకాలంటే సినిమా హిట్ కావాలని కోరుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం పరిశ్రమలో బర్నిగ్ మూవీ సాహో హిట్ కొట్టాలని అంతా గంపెడాశతో ఉన్నారు. హిట్ కొడితే ఇండస్ట్రీ నిలదొక్కుకుంటుంది. మరో భారీ మూవీతో ఏంటో మందికి పని దొరుకుతుందని ఆశ. మూవీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్‌తోపాటు డిజిటల్ విభాగాలు, వాటిపై ఆధార పడిన వృత్తి పనివారు, వ్యాపార వర్గాల వారు నిలదొక్కుకోవాలంటే సినిమా తప్పనిసరిగా హిట్ కావాలి మరి. ఈ వాదనలో న్యాయం ఉంది. నిజమే..! అందుకు తగ్గట్టు సబ్జెక్ట్ ఎక్సర్‌సైజ్ చేస్తే ఫాన్స్‌తో పటు ప్రేక్షకుల ఆదరణ అదిరిపోతుంది. ముందుగా ఆసక్తికరమైన స్టోరీ, స్క్రీన్ ప్లే కోసం కష్ట పడకుండా, భారీ లోకేషన్స్, సీన్స్ అంటూ రీల్ చుట్టేశాక మధనపడితే ఫలితం ఏముంటుంది. 300 కోట్ల బడ్జెట్ ప్రభాస్ మూవీ సాహో అన్ని హంగులతో హిట్ కొడుతుందని…కొట్టాలని.. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు గంపెడాశతో ఉన్నాయి.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ఇండస్ట్రీ బతకాలంటే సాహో హిట్ కొట్టాలి స్వామీ..!