ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కూడా మారిపోయింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేక పోయింది. కానీ వసూళ్ళ పరంగా మాత్రం మంచిగానే రాబట్టింది.
ఇక తాజాగా ఆ సినిమా పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని ఇన్స్‌బ్రక్‌లో చేసిన షూటింగ్ వీడియోలో చూపించారు. ఇన్స్‌బ్రక్‌లో షూటింగ్ ఓ అద్భుత అనుభవం. అక్కడి వాతావరణం, మంచి మనసున్న మనుషులు, అద్భుత కట్టడాలు సూపర్. మా షూటింగ్‌ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఇన్స్‌బ్రక్ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.