క్రేజీ మూవీ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది. రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 దాకా వేచి చూడాలంటే మావల్ల కాదని అంటున్నారు డార్లింగ్ ఫాన్స్. హాలివుడ్ రేంజ్ చేజింగ్స్…! బాలీవుడ్ తలదన్నే థ్రిల్స్… బహుబలిని మరిపించే మేజిక్స్.. టోటల్‌గా స్క్రీన్ షో అదరహో…సాహో…! అంటూ ఫాన్స్ ఒకటే మాట్లాడేసుకుంటున్నారు. సాహో ఎప్పుడొస్తుందా గాళ్స్ ఎదురుచూపులు. అందరి అంచనాలను పెంచేస్తూ ఆగస్టు 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి సాహో రిలీజ్ కానుంది.
ఇక ఏటా రెండు మూవీలతో అభిమానుల్ని మురిపించి మైమరపించి మెప్పిస్తానంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ …రెండేళ్ళు ఫుల్ రేంజ్‌లో కష్టపడి..ఇష్టపడి… మళ్లీ రికార్డ్‌లు క్రియేట్ చేయాలన్న పట్టుదలతో రెడీ చేసిన ‘సాహో’ సూపర్ సక్సెస్ గ్యారెంటీ అని బాక్సాఫీస్ ఢంకా ముందుగానే భజాయించేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్..!
డైరెక్టర్ సుజీత్ సాహోలో ఒక రేంజ్ యాక్షన్ చేయించి ప్రభాస్‌తో సూపర్ మేజిక్ చేశాడని టాక్. ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్‌గా జరిగినట్టు టాక్. దాదాపు 333 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాం రూ. 40, సీడెడ్ రూ. 25, కృష్ణా రూ. 8, గుంటూరు రూ. 12.50, నెల్లూరు రూ. 4.50, ఈస్ట్, వెస్ట్ రూ. 19, నార్త్ ఆంధ్రా రూ. 16, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 125 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక రూ. 28, తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 18, బాలీవుడ్ రూ. 120, ఓవర్సీస్ రూ. 42, మొత్తం రూ. 333 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.