ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నోట విన్నా రెండే రెండు హాట్ టాపిక్స్… ఒకటి ప్రభాస్ హీరోగా విడుదలకు సిద్ధంగా ఉన్న సాహో టాక్ అండ్ రెండవది మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 151 వ సినిమా “సైరా నరసింహా రెడ్డి”. సాహో సినిమా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని ఈ నెల 30న విడుదల కాబోతోంది. మొన్నే సాహో భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంప్లీట్ చేసుకుని, అంచనాలను మరింతగా పెంచేసింది.
ఇక మెగా స్టార్ సినిమా “సైరా” విషయానికొస్తే, ఇది కూడా 200 కోట్లకు పైగానే బడ్జెట్‌తో నిర్మిస్తున్న భారీ చారిత్రాత్మక సినిమా. ఈ సినిమాకు చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాత. తమ హోం ప్రొడక్షన్ బ్యానర్ “కొణిదెల ప్రొడక్షన్స్”పై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు సైరా కూడా షూట్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉంది.
కేవలం విజువల్స్ పరంగానే కాకుండా, నేపథ్య సంగీతం, కెమెరా, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, విజువల్ ఎఫెక్ట్స్… ఇలా ప్రతీ ఒక్కరి కృషి, వారితో దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ మూవీని ఒక విజువల్ వండర్‌గా తీశాడని టాక్. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది ఈ మూవీలో మెగాస్టార్ లుక్స్ అండ్ అప్పియరెన్స్. నిజంగా ఒక యోధుడిని చూసినట్టే అనిపిస్తున్నారు చిరు. తన ఆహార్యం అండ్ ట్రాన్స్‌ఫార్మార్ పెర్ఫామెన్స్‌తో మెగాస్టార్ సైరాలో వీర రసం ఒలికించారు. ఇవన్నీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.