శుక్రవారం విడుదల కానున్న ‘సాహో’
టికెట్ రేట్ల పెంపు దారుణమంటూ కోర్టుకెక్కిన నట్టి కుమార్
దిల్ రాజు సహా పలువురికి నోటీసులు
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా నిర్మితమైన ‘సాహో’ ఈ శుక్రవారం నాడు విడుదల కానుండగా.. స్పెషల్ షో పేరుతో టికెట్ రేట్ పెంచుకునేందుకు ఏపీ సర్కారు అనుమతించడం కోర్టు వివాదంలో పడింది. దీనిపై నిర్మాత నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జీ శ్యామ్ ప్రసాద్, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. సినిమా టికెట్లను దారుణంగా పెంచేశారని, టికెట్ రూ.300 వరకూ నిర్ణయించారని, వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నట్టి కుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్‌కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్, ‘సాహో’ చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది.