బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్ధులు చేస్తున్న శాంతియుత నిరసనలు ఏడు రోజులకు చేరింది. 12 డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా వస్తున్న రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు క్యాంపస్ లోని అనుమతించడం లేదు. ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులతో ప్రభుత్వం తరఫున పలుమార్లు సంప్రదింపులు జరిపిన ఫలితం లేకుండా పోయింది.
దీంతో విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి నివాసం ముట్టడించారు. ట్రిబుల్ ఐటీ విద్యార్ధులు చేస్తున్న శాంతియుత నిరసనలకు తమ మద్దతు.. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉంటోందని తెలిపారు.
మంత్రి తక్షణమే స్పందించి ట్రిబుల్ ఐటీ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు బాసర ట్రిబుల్ ఐటీని సందర్శించాలని డిమాండ్ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత వైస్ చ్యాన్సలర్ ను నియమించాలని కోరారు.
ఈ మేరుకు సబిత ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన నిరసనకారును పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.