హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితాఇంద్రారెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. రాజ్భవన్లో నూతన గవర్నర్ తమిళిసై ఆమెతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్లో నూతన మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కగా, అందులో మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వరుసలోమూడవ వ్యక్తిగా వెళ్లి ప్రమాణం చేశారు. ఆమెతో నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనితో ఆమెకు మరోసారి మంత్రి పదవి లభించింది. కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి… ఈసారి తెరాస నుంచి చోటు దక్కించుకున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కడం వల్ల రంగారెడ్డి జిల్లా నుంచి ముచ్చటగా మూడోసారి మంత్రిగా పనిచేస్తున్న ఏకైక మహిళగా సబితా ఇంద్రారెడ్డి గుర్తింపు సాధించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » ఫస్ట్ లేడీ మినిస్టర్ సబితా