ప్రభుత్వం జంట జలాశయాలకు సంబంధించి ఎలాంటి కాలుష్యం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 111 జీవోను ఎత్తివేయడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
బాధ్యతను విస్మరించి రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ కోసమే 111 జీవో ఎత్తివేశారని బీజేపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. కావాలనే బీజేపీ నాయకులు హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారని ఆరోపించారు.
జీవోను ఎత్తివేయడం వల్ల హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రజల సమస్యలను విస్మరించి.. రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవో ఎత్తివేతపై విమర్శలు చేసే నాయకులు 84 గ్రామాల ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఆ ప్రాంతాలను ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిపేందుకే జీవోను ఎత్తివేయడం జరిగిందని సబిత తెలిపారు.