సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ గురువు దివంగత రమాకాంత్ అచ్రేకర్ మొదటి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ట్విట్టర్ లో భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు. ” మీరు మా హృదయాల్లో ఉన్నారు..అచ్రేకర్ సార్” అని ఇంగ్లీష్, మరాఠీలో రాశారు. తన ట్వీట్ తో పాటు అచ్రేకర్ తో దిగిన పాత ఫోటోను కూడ పోస్ట్ చేశారు. వృద్ధాప్యపు సమస్యలతో 2019 జనవరి 2న అచ్రేకర్ మరణించారు.
ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమాకాంత్ అచ్రేకర్… సచిన్ టెండూల్కర్ తో పాటు వినోద్ కాంబ్లీ, ప్రవీన్ అమ్రే లకు ముంబైలోని శివాజీ పార్క్ లో క్రికెట్ శిక్షణ నిచ్చాడు.
వినోద్ కాంబ్లీ కూడా తన గురువుకు నివాళులర్పిస్తూ ” మీ లాంటి గురువు ఎవరు లేరు..ఎందుకంటే నాకు మంచిగా క్రికెట్ ఆడటం నేర్పించడమే కాదు..నిజ జీవిత పాఠాలు కూడా నేర్పించారు…ఐ మిస్ యు ఎ లాట్ అచ్రేకర్ సార్” అని ట్విట్ చేశారు.