హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ఫార్ములా-ఈ రేస్ ఛాంపియన్ షిప్ కు సెలబ్రిటీలు తరలిస్తున్నారు. మనదేశంలో మొదటిసారిగా ఈ ఈవెంట్ జరుగుతుండడం, అందుకు హైదరాబాద్ లాంటి మహా నగరం ఆతిథ్యం ఇవ్వడంతో సినీ, క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ రేసింగ్ ని చూసేందుకు వస్తున్నారు. శుక్రవారం నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్మీప్రణతి, మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తదితరులు ఈ రేస్‌లో సందడి చేశారు.
శనివారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు రేసింగ్ పోటీలకు హాజరయ్యారు. కాగా ఈ రేసు కోసం చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు సచిన్. రామ్ చరణ్ తో కలిసి ఆయన ఫార్ములా-ఈ రేస్ వద్ద సందడి చేశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా, 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ పోటీ దిగ్గజ సంస్థలు బరిలోకి దిగుతున్నాయి. కాగా ఈ రేసింగ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
గంటకు 300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోయే ఫార్ములా ఈ కార్ల విన్యాసం చూసేందుకు హైదరాబాద్ నగర వాసులు ఉత్సాహం చూపుతున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేస్ ప్రారంభంకానుంది. అలాగే సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్ ను కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT
— Bharat Sharma (@sharmabharat45) February 11, 2023