హోటల్ కుర్రాళ్లతో సచిన్ గల్లీ క్రికెట్

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆశ, స్వాస క్రికెట్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా సచిన్ కు ఆ క్రీడమీద మమకారం ఏమాత్రం తగ్గడంలేదనేందుకు ఈ సంఘటనే ఎగ్జాంపుల్. తాజాగా సచిన్‌ ముంబయిలో రోడ్డుపై హోటల్ లో పనిచేసే కుర్రాళ్లతో క్రికెట్‌ ఆడాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ విజువల్స్‌ను సచిన్‌ బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లి తన ట్విటర్‌ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే విల్లే పార్లీలోని దయాల్‌దాస్‌ రోడ్డులో సచిన్‌ క్రికెట్‌ ఆడగా, అదేసమయంలో అటుగా కారులో వెళ్తున్న ఓ చిన్నారి గుర్తుపట్టి సచిన్‌ సచిన్‌ అని పిలవడం విశేషం. ప్రస్తుతం సచిన్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.