క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పటికే అత్యధిక మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాలో ఉంది. అయితే యాక్టింగ్ ను కెరీర్ తీసుకోవాలని ఈ స్టార్ కిడ్ ఆలోచనలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతి త్వరలోనే ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమెకు నటన పట్ల ఎంతో ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని బ్రాండ్స్ ల యాడ్స్ లోనూ నటించింది. ఆ సమయంలో యాక్టింగ్ కు సంబంధించి పాఠాలను కూడా ఆమె నేర్చుకుంది. గ్లామర్ వరల్డ్ లో సెటిల్ కావాలన్నది ఆమె కోరిక అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
షాహిద్ కపూర్ సినిమాతో ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను సచిన్ ఖండించారు. తన కూతురు ఇంకా చదువుకుంటోందని, ఆమె ఇప్పుడు సినిమాల్లో నటించే అవకాశం లేదంటూ కొట్టిపడేశారు. దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీపై వార్తలు ఆగిపోయాయి.
తాజాగా ఆమె బాలీవుడ్ లో ప్రవేశించడానికి తన తల్లిదండ్రులను ఒప్పించినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఆమె బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వర్గాలు పేర్కొన్నాయి.