ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని జీవన్ హాస్పిటల్ లో ఈనెల 8 మధ్యాహ్నం సునీత అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అదేరోజు రాత్రి సునీత చనిపోయనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, డాక్టర్ల నిర్లక్ష్యం వలనే సునీత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.
బాబు పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని ఇక్కడి నుంచి తీసుకుపోవాలని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారని సునీత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళన చేస్తున్నారు.