సుశాంత్ మరణంతో బాలివుడ్లో నెపొటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే..సుశాంత్ మరణానికి కారణం నెపోటిజం అనేవైపు నుండి చర్చ రియావైపు కి పోయింది..మరోవైపు బాలివుడ్ పెద్దలు, సుశాంత్ చావుకి కారణం అయిన ప్రతి ఒక్కరిపై అభిమానుల కోపం మాత్రం చల్లారలేదు..ఇప్పుడు సడక్ 2 ట్రైలర్ రూపంలో అవకాశం దొరికింది..దాంతో డిస్ లైక్స్ రూపంలో తమ రూపాన్ని వెళ్లగక్కుతున్నారు అభిమానులు..
సంజయ్‌దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా భట్ ప్రదాన పాత్రలుగా రూపొందిన సినిమా “సడక్ 2” . ఈరోజు (ఆగస్ట్ 12) న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.28న హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ప్మాం పై ఈ సినిమా రిలిజ్ కానుంది..అయితే ఈ సినిమా పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది..ఎవరూ కూడా ఈ సినిమా చూడకూడదంటూ ట్రైలర్ రిలీజైన మరుక్షణం నుండే తమ కోపాన్ని చూపిస్తున్నారు అభిమానులు ..యూట్యూబ్లో రిలీజైన ఈ ట్రైలర్ కు లైకులు అరవై వేలుంటే,డిస్ లైక్స్ 6 లక్షలుండడం గమనార్హం..
1991లో సంజయ్‌దత్, పూజా భట్ జంటగా మహేశ్ భట్ దర్శకత్వం వహించిన సడక్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు..దీనికి కూడా మహేశ్ భట్ దర్శకత్వం వహించాడు..సుశాంత్ మరణానికి కారకుల్లో ప్రధానంగా మహేశ్ భట్ పేరు వినిపిస్తుంది..దాంతో తమ ఆగ్రహాన్ని తెలియచేయడానకిి ఇదే సరైన సమయం అన్నట్టుగా భావిస్తున్నారు అభిమానులు.మరి అభిమానుల ఆగ్రహం బాలివుడ్లో నెపొటిజంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూడాలి…గతనెల రిలీజైన సుశాంత్ సినిమా దిల్ బేచారా ఒక్క రోజులోనే బాలివుడ్ కలెక్షన్లను దాటింది.. సడక్ 2 ను మాత్రం మోస్ట్ డిస్ లైక్డ్ మూవి ఖాతాలో వేయాలన్నట్టుగా చూస్తున్నారు.
Watch Video :