టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని బీజేపీ కండువా కప్పుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు యామిని. టీడీపీ ప్రభుత్వ హయాంలో యామిని అప్పటి ప్రతిపక్షం చేసే విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టేవారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూడటంతో ఆమె అదే పార్టీలో కొనసాగుతారా లేక మరో పార్టీలోకి వెళ్తారా అనే మీమాంస కొనసాగింది. ఇటీవల కాలంలో ఆమె కాస్తా సైలెంట్ అవ్వడంతో యామిని బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఆమె బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపించాయి.