ఢిల్లీకి చెందిన నిక్కీ యాదవ్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సాహిల్, నిక్కీలది సహజీవనం కాదని, వారికి ఇది వరకే వివాహమైనట్టు పోలీసులు వెల్లడించారు. నిక్కీని కాదని సాహిల్ వేరే వ్యక్తిని వివాహం చేసేకునేందుకు రెడీ అయిన నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందన్న వార్తల్లో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
వారిద్దరికీ రెండేండ్ల క్రితమే వివాహం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో వారిద్దరికీ యూపీలోని నోయిడాలోని ఆర్యసమాజ్ లో వివాహం జరిగిందన్నారు. వీరి వివాహ ధ్రువపత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కానీ వీరి పెళ్లిని సాహిల్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్నారు. నిక్కీ హత్యలో సాహిల్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాత్ర ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో నిందితుడి తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేశ్, అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నిక్కీని కాదని సాహిల్ గెహ్లాట్ మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సాహిల్‌ని నిక్కీ నిలదీసింది. దీంతో కారులో వారిద్దరూ గొడవ పడ్డారు. మాటా మాటా పెరగడంతో నిక్కీ మెడకు ఛార్జింగ్ కేబుల్ తో ఉరి బిగించి సాహిల్ హత్య చేశాడు.
నిక్కీ మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక సాహిల్ స్నేహితుల సాయాన్ని కోరాడు. కారులో ఆ మృత దేహాన్ని వారి దాబాకు తీసుకెళ్లాడు. అక్కడి ఉన్న ఓ రిఫ్రిజిరేటర్ లో మృత దేహాన్ని దాచి పెట్టాడు. అంతకు మ
కారులో వీరి గొడవను గమనించిన పక్క ఫ్లాట్ వ్యక్తి నిక్కీ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. సాహిల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో సాహిల్ తన నేరాన్ని అంగీకరించాడు.