సాహితీ స్కామ్ లో లీలలెన్నో..?
మంది సొమ్ముతో మస్త్ మజా..?
ఎదురోచ్చినోడికల్లా.. ఎగజల్లడమే పని..?
లావీచ్ గా ఫంక్షన్స్ – పార్టీలు..
నిర్మాతగా అవరమెత్తిన వైనం..
జగతిబాబుని బుట్టలో వేసుకుని తిప్పుకున్నాడు..
టెన్షన్స్ తట్టుకోలేక కోకైన్ వాడుతున్న ముఠా?
బూదాటి అంటే పోలీసులకు పండగే..
మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు సొంతిళ్లు ఇస్తామని చెప్పి.. 3 వేల కుటుంబాల సొమ్మంతా దొచుకున్నారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అందినకాడికి బోంచేశారు. ఇప్పటికే ఓ మహిళ ఎమ్మెల్సీకి రూ.7 కోట్లు, మాజీ మంత్రికి రూ.2కోట్లు, స్థానిక ఎమ్మెల్యేలకు ఫ్లాట్స్, ఒక కోటి వరకు ముట్టచెప్పారు. టీటీడీ సభ్యుడి కోసం 10 కోట్లు, విశాఖ స్వామీకి హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతటితోనే అయిపోలేదంటున్నాయి దర్యాప్తు సంస్థలు. ఎవరెవరిని ఎలా వాడుకున్నారో.. డబ్బులు ఎలా ఖర్చు చేశారో.. వాటన్నింటిని రికవరి చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు జరగనుంది.
ప్రాజెక్ట్స్ వారిగా ఎగజల్లడమే..
కాకతీయహిల్స్ లో పనోరమా పేరుతో అపార్మెంట్స్ నిర్మాణం చేపట్టారు. తమ భూమి కాకుండానే దొంగ పత్రాలతో భూమిని కబ్జా చేసుకున్నారు. భూ ప్లాట్ ఓనర్స్ కి పైన ప్లాట్స్ ఇస్తామని ఒప్పుకున్నారు. రోడ్లు, పార్క్ స్థలాన్ని కబ్జా చేసి.. అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారు. అందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రూ.2 కోట్ల ఒప్పందం జరిగి ఒక కోటి రూపాయలు ముట్టజెప్పారు. తన సన్నిహితుడైనా కిశోర్ కి రూ.2 వేలకు స్క్వేయిర్ ఫీట్ చొప్పున ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి అనుమతులు ఇచ్చేలా పావులు కలిపారు. ఇక్కడ పనిచేసిన అప్పటి సీఐకి కేసులు కాకుండా రూ.50 లక్షలు లంచం ఇచ్చారు. అదే డబ్బును ఎలాగైనా తీసుకోవాలని, పనోరమాలో ప్లాట్ కొనుగోలు చేయాలని డబ్బులు వెనక్కి తీసుకున్నారంటే.. వారి లాబీయింగ్ ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. మాదాపూర్ మరో సీఐ కళింగంగా రూ.10 లక్షలు ఇచ్చి.. బాధిత కుటుంబాలకు చెందిన వారిపై వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారు లక్ష్మీ నారాయణ రావు . వారిని పోలీస్ స్టేషన్ లోనే బంధించి.. ఆ టైంలోనే అనుమతులు మంజూరు చేయించుకుని వారి ఫేవరేంటో చూపించారు. కష్టార్జితుల సొమ్ముతో.. లెక్కలేనంతగా అధికారులకు లంచాలు ఇచ్చారు. ఇదే కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసినా.. దొంగ యూఎల్సీ సర్టిఫికేట్స్ సృష్టించి.. కలెక్టర్స్ ముద్రలు తయారు చేస్తున్నారని కళ్ల ముందు కనిపించినా.. గులాబీ నోట్ల మత్తులో ఎవ్వరికి అవి కనిపించలేదు.. ఫేక్ తయారీ ముఠా వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటో పేర్లతో సహా.. మరో కథనంలో వివరించబోతుంది తొలివెలుగు క్రైం బ్యూరో.
అమ్మాయిల కోసమే స్పై సినిమా..?
సీరియల్ నటుడు సాగర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. ఈజీ గా వచ్చిన సొమ్ముతో స్పై అనే సినిమాని నిర్మించే ప్రయత్నం చేశారు లక్ష్మీ నారాయణ. అక్కడ కోటిన్నర పెట్టుబడులు పెట్టారు. వారణాసిలో షూటింగ్ కోసం స్పెషల్ ప్లైట్స్ లో తండ్రి, కొడుకులు వెళ్లేవారు. హీరోయిన్స్ వీరనుకున్నట్లుగా సహాకరించకపోవడంతో సినిమాని మధ్యలో వదిలేశారని సినీ వర్గాల్లో చర్చ. డైరెక్టర్ రమేష్ దేశాని, స్క్రిప్ట్ డీవీఎస్ రవితో సినిమాని మేకింగ్ చేసి వదిలేశారు.
లాక్ డౌన్ లో మొయినాబాద్ ఫామ్ హౌస్..
సాహితీ మరో డైరెక్టర్ ఆంటోనీ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ మొయినాబాద్ లో ఉంది. లాక్ డౌన్ టైంలో రేవ్ పార్టీలతో ఎంజాయ్ చేశారని ఎస్వోటీ పోలీసులకు సమాచారం ఉండేది. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహాకారం పూర్తిగా ఉండటంతో రైడ్స్ చేయలేకపోయారు. గత రెండేళ్లుగా వస్తున్న టెన్షన్స్ భరించలేక.. కోకైన్ తీసుకుంటున్నట్లు అభియోగాలు ఉన్నాయి. డ్రగ్స్ టెస్ట్ చేయిస్తే.. మరో కోణం కూడా వెలికి తీయవచ్చని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫంక్షన్స్ కి భారీగా ఖర్చు..
కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్ కన్వేషన్ లో ఓ రేంజ్ లో పార్టీ ఇచ్చారు లక్ష్మీ నారాయణ. అప్పుడు రాజకీయ నేతలంతా క్యూ కట్టారు. వారి సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే. గిప్ట్స్ ఇవ్వడంతో అత్యంత దగ్గర అయ్యాడు బూదాటి. కూతూరి పెళ్లి రూ.20 కోట్లు పెట్టి చేశారు. మద్యంకే రూ.2 కోట్లు ఖర్చు చేశాడు. 6 కోట్లు విలువ చేసే కార్లన్ని నగదు పెట్టే కొనుగోలు చేశారు. వైజాగ్ లో బ్యాంకుని ఫ్రాడ్ చేసిన కేసులో శిక్షపడటంతో ఏ బ్యాంకు కార్ లోన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.
అమెరికాలో 1000 ఎకరాలు?
అమెరికాలో డల్లాస్ లో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. కొడుకు పేరుమీద రెస్టారెంట్స్ ఓపెన్ చేయించారు. ఇక్కడ డబ్బుతో అక్కడ పెట్టుబడులు పెట్టాలని చూశారు. అయితే ప్రాజెక్ట్స్ ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదు.
చెప్పుకోలేని వారేందరో..
సాహితీ స్కామ్ బాధితుల్లో డిఫరెంట్ గా ఉన్నారు. సొంతింటి కోసం జీవితాంతం కష్టపడి సంపాదించిన వారు 90 శాతం మంది ఉంటే.. బ్లాక్ మనీ వైట్ చేసుకోవడం కోసం.. మొత్తం నగదు ఇచ్చిన బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారి దగ్గర నుంచి రూ.45 కోట్లు నగదు తీసుకున్నారు. ప్రగతి నగర్ లో ఆనంద్ నాయుడు ప్రాజెక్ట్ లో ఏషియన్ సర్జికల్ ఓనర్ రూ.6 కోట్లు ఒకేసారి ఇచ్చి కమర్షియల్స్ బుక్ చేసుకున్నారు. బయటకు చెప్పుకోలేక లోన దాచిపెట్టుకోలేక కుమిలి పోతున్నారని తెలుస్తుంది. ఇలా సునీల్ హౌజా, ఫైనాన్సర్ కేడియా చాలా మంది ఉన్నారు.. కాని పేర్లు బయటపడితే ప్రైవసీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కేడియా మోసాన్ని గ్రహించి.. పనోరమా లోని కొన్ని ప్లాట్స్ ని మార్టిగేజ్ చేయించుకున్నారు. దాని పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది.
క్రికెట్ దేవుడి భూమి పైన బిజినెస్..
గచ్చిబౌలి, కోకాపేట్ మధ్యలో 5 ఎకరాల భూమి ఓ మాజీ క్రికెటర్ కి ఉంది. ఆ వ్యవహారం అంతా చాముండేశ్వరీ నాథ్ చూస్తుంటారు. ఆ భూమి పూర్తిగా అగ్రిమెంట్ కాకముందే.. భూమి అడ్రస్ చెప్పి అడ్వాన్స్ లు తీసుకున్నారు సాహితీ డైరెక్టర్స్. ఈ విషయం తెలుసుకుని అగ్రిమెంట్స్ రద్దు చేసుకున్నారు.
జగతిబాబు అమాయకత్వాన్ని ఆడుకున్నాడు..
సినిమాలో హీరోయిజం చూపిస్తూ.. నిజజీవితంలో బోల్డ్ గా ఉండే జగతిబాబుని ప్రచారానికి వాడుకోని.. 13వ అంతస్థులో 5000 స్క్వేయిర్ ఫీట్స్ ప్లాట్ ఇస్తామని తిప్పించుకున్నారు. ఆ వివాదస్పద మైన సైట్ లో కోట్లు కుమ్మరించి.. 9 అంతస్తులకే అనుమతి తీసుకున్నారు. రెండేళ్లుగా ఆయన ఆ ఊహాల్లోనే బతికారు.. ప్రచారం చేశారు.. అసలు విషయం తెలుసుకుని లక్ష్మీ నారాయణను చీదరించుకున్నాడు జగతిబాబు.
సాహితీ స్కామ్ చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. కంపెనీ ప్రారంభం అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఎలా బిజినెస్ చేశారు? కేసులు కాకముందుకు దోచుకున్న వారేవరు? కేసులు నమోదు అయ్యాక.. డైరెక్టర్స్ ఎలా మారారో రేపటి కథనంలో చూద్దాం.