విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహంను ధ్వంసం గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల అంతర్వేదిలో రథం ను తగలబడిన సంగతి తెలిసిందే. ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఈ సమయంలో మళ్లీ ఇలా జరగటం పట్ల హిందూ సంఘాల మండిపడుతున్నాయి.