సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట మెడికవర్ ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇక ఆయన ఆరోగ్యం పట్ల వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు.
తాజాగా లేటెస్ట్ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు వైద్యులు. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు, ఆయనకు వెంటిలేటర్‌ను తొలగించారు. మరియు సొంతంగానే ఆయన శ్వాస తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులు ఆయన హాస్పిటల్ లోనే కొనసాగుతారు అంటూ ప్రకటించారు.