సాయి తేజ్ యాక్సిడెంట్ పై ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి అతి వేగం ఓ కారణమైతే.. రోడ్డుపై ఉన్న మట్టి మరో కారణంగా చెబుతున్నారు పోలీసులు. అందుకే బైక్ స్కిడ్ అయిందని ప్రాథమిక విచారణ ద్వారా తేల్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు పోలీసులు. అయితే అతను హెల్మెట్ ధరించాడని.. అందుకే తలకు ఎలాంటి గాయం కాలేదని వివరించారు. హెల్మెట్ ఉండడం వల్లే పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అలాగే మద్యం కూడా సేవించలేదని నిర్ధారించారు పోలీసులు.
సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలించారు. ఇంకొన్ని గంటల్లోనే కోలుకుంటాడని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. ఇటు తేజ్ నడిపిన బైక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.