రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి తేజ్ అపోలోలో కోలుకుంటున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే ఓసారి యాక్సిడెంట్ కు ముందు, తర్వాత జరిగిన పరిణామాల్ని టైమ్ లైన్ ద్వారా తొలివెలుగు అందిస్తోంది.
– శుక్రవారం రాత్రి 7.44 గంటలకు గచ్చిబౌలి బయలుదేరిన తేజ్
– రాత్రి 7.58 గంటలకు కేబుల్ బ్రిడ్జ్
– రాత్రి 8.01 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపు వెళ్లిన తేజ్
– రాత్రి 8.05 గంటలకు యాక్సిడెంట్
– రాత్రి 8.07 గంటలకు 108కు ఫోన్
– రాత్రి 8.25 గంటలకు మెడికవర్ ఆసుపత్రిలో చేరిక
– రాత్రి 8.29 గంటలకు మెడికవర్ కు చేరుకున్న పోలీసులు
– రాత్రి 8.40 గంటలకు సాయి తేజ్ కు చికిత్స
– రాత్రి 8.59 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు
– రాత్రి 10.45 గంటలకు అపోలో ఆసుపత్రికి తరలింపు